Wednesday, January 21, 2015

ఆయుర్వేద చికిత్సా పద్ధతులు

నిమ్మకాయతో చికిత్సలు


             నిమ్మకాయలో ఉన్న విటమిన్‌ సి పొటాషియం, ఫాస్పారిక్‌ యాసిడ్‌ మనం తీసుకున్న ఆహారపదార్ధంలోని ఐరన్‌ అనే ఖనిజం వంటపట్టేట్టు చేసి రక్తహీనత నుండి కాపాడుతుంది. నిమ్మపండుతోని క్షారాలు యూరికామ్లం ప్రభావం నశింపజేస్తుంది కాబట్టి నిమ్మరసం అధికంగా తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అతిగా ఏ పదార్ధాన్ని తీసుకున్నా ఏదో ఒక అనర్ధం వెన్నంటే ఉంటుంది. అదే తక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలలో వేరే కారణాలతో ఏర్పడిన రాళ్లను కరిగిస్తాయి. 

             కాబట్టి నిమ్మకాయను అనుదినం ఆహారంలో సేవించే వారికి జీర్ణాశయంలోని హానిచేయు క్రిములు నశిస్తాయి. నిమ్మరసం రక్తకణాలలోని కొవ్వును కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరగడంలో ఎంతో ఉపకరిస్తుంది. వేసవిలో కలిగే తాపానికి చల్లని నీటిలో పంచదార, నిమ్మరసం కలిపి ఇస్తే తాపం హరిస్తుంది. ఇంకా వాంతులు అయ్యే వారికి ఇస్తే వాంతులు ఆపి, ఆకలిని పెంచుతుంది. జ్వరం ఉన్నవారికి ఇస్తే అతిదాహం, తాపం కూడా నివారిస్తుంది. రక్తం కారడం, విరేచనాలు కూడా తగ్గిస్తుంది.

ఆరోగ్య చిట్కాలు


పక్షవాతం కారణంగా శక్తిహీనమయిన అవయవానికి : 

            మిరియాలు నీటితో ముద్దగా నూరి ఈ ముద్దలో కాస్తంత నువ్వుల నూనె కల్పి.... చచ్చుబడిన అవయవానికి మర్ధన చేయాలి. ఇలా చేస్తుంటే అవయవం పూర్వపు శక్తిని సంతరించుకుంటుంది.


మిరియాల చారు: 
            రోజూ రాత్రి ఏ కూర తిన్నా, తినకున్నా... అల్లం, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లితో చారు పెట్టుకొని అన్నం తక్కువ చారు ఎక్కువగా వేసుకొని తింటే జీర్ణపరమైన అన్ని బాధలు తొలగిపోతాయి. జీర్ణశక్తి వృద్ధి చెంది ఆకలవుతుంది. నాలుక రుచి తెలుస్తుంది. ఇంకా... కడుపుబ్బరం, గ్యాస్ కడుపులో నొప్పి బాధలు కూడా ఉండవు.

ఉప్పు వైద్యం (రాతి ఉప్పు లేదా కల్లు ఉప్పు) : 
           గొంతులో పుళ్ళు, బొంగురుపోవడం, గొంతులో ఇన్ ఫెక్షన్ కారణంగా గొంతు మ్రింగనీయపొవడం గుచ్చుకన్నట్లు, టాన్సిల్స్ లో బాధ, నోటి పూత, గొంతు పూత వీటన్నింటికి .... ఓ గ్లాస్ నీటిలో రెండు చెంచాల ఉప్పు వేసి మరగించి పుక్కిట పట్టాలి. అలాగే పళ్ళు తోమినపుడు చిగుళ్ళ వెంట రక్తం వస్తుంటే... దంత దావనం అయ్యాక ఓ గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అరచెంచా ఉప్పు వేసి కరిగించి.... ఈ నీటిని పుక్కిలిపట్టాలి.

అరికాళ్ళ మంటలు: 
          ఆవునేతిలో మిరియాలు వేసి బాగా మరగనవ్వాలి... మిరియాలు తొలగించి ఆ ఆవునెయ్యితో అరికాళ్ళు మర్ధన చేయండి. అదే మంచి నూనెలో మిరియాలు మరగనిచ్చి ఆ నూనెతో మర్ధన చేస్తే బెణుకు నొప్పులు తగ్గుతాయి.

పీరియడ్స్ దోషాలు : 
          పసుపుకొమ్ములు దంచి తయారు చేసుకున్న పసుపును 5 గ్రాములు మోతాదులో ప్రతిరోజూ మాత్రలుగా చేసుకొని... వేసుకుంటుంటే ఋతుతరుణంలో ఎదురయ్యే పలు సమస్యలు తొలగిపోతాయి.

కళ్ళు అలసిపోతే : 
        పదిచెంచాల నీటిలో 2 చెంచాల జీరకర్రను నానబెట్టాలి. ఒక గంట తర్వాత జీరకర్ర తొలగించి.... ఈ జీరా నీళ్ళలో దూది ముంచి ఆ దూదిని రెండు కళ్ళపైనా వేసుకోవాలి. ఇలా ఓ పావుగంట చెయ్యాలి.

గాయం సెప్టిక్ కాకుండా మానాలంటే : 
        వేపనూనె ఓ పదిచెంచాలు ఓ చెంచా పసుపు పొడి కల్పి వేడి చేయాలి. దీంట్లో స్టెరిలైజ్డ్ కాటన్ ను ముంచి కొంతసేపు ఉంచి.... ఈ కాటన్ ను గాయంపై ఉంచి కట్టు కట్టాలి.

కడుపులో మంటకు: 
        ఒక గ్లాస్ నీటిలో నాలుగు చెంచాల ధనియాలు వేసి మూత పెట్టి రాత్రంతా ఉంచి ఉదయానే ఆ ధనియాలను పిసికి అవతల పారేసి ఆ నీటిలో ఒక స్పూన్ పంచదార వేసుకొని త్రాగాలి. ఇలా రోజూ చేస్తుంటే... ఎంత దీర్ఘకాలం మంటయినా తగ్గిపోతుంది.

గ్యాస్ ట్రబుల్ లక్షణాలకు : 
       సోంపు లేదా సోపు కొంచెం నేయ్యి వేసి దోరగా వేయించి... రోజూ రెండు మూడు సార్లు అరచెంచా నుండి చెంచా మోతాదులో తీసుకోవాలి.

పేగుల్లో పూత లేదా పుండు : 
       వాముని పొడికొట్టి రోజూ ఈ వాము పొడిని ఉదయం ఓ చెంచా, రాత్రికి ఓ చెంచా మంచినీటితో తీసుకోవాలి.

కీళ్ళ నొప్పులు : 
       శొంఠి, నువ్వులు, బెల్లం సమంగా తీసుకొని నూరి రేగిపండంత మాత్రలు చేసుకొని రోజూ మూడు పూటలా పాలతో వేసుకోవాలి. ఇలా చేస్తే కీళ్ళ నొప్పులు, వాపులు, కీళ్ళ వాతం తగ్గిపోతుంది.

No comments:

Post a Comment