- అజీర్ణంతో బాధపడుతున్నవారు
భోజనం తర్వాత అరకప్పు పైనాపిల్ జ్యూస్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- ఒక గ్లాస్ గోరువెచ్చని
నీటిలో ఒక స్పూను నిమ్మరసం, రెండుస్పున్లు తేనె, అల్లం ముక్కలు చిన్నవి వేసుకుని అన్నింటినీ
మిక్స్ చేసుకుని ఆ మిశ్రమాన్ని అజీర్తిగా అనిపించినప్పుడు తాగాలి.
- అజీర్తి వల్ల కడుపునొప్పిగా, ఇరిటేషన్‌గా అనిపిస్తున్నప్పుడు ద్రాక్షపళ్ళు
తింటే ఉపశమనం కలుగుతుంది.
- భోజనం అయిపోయిన తర్వాత
పొట్టమీద ఐస్‌బ్యాగ్ తో మసాజ్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
- నిమ్మరసం అజీర్తిని పోగొట్టడం
లో బాగా పనిచేస్తుంది. ఇది అజీర్తితో కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతుంది.
ఒక కప్పు వేడి నీటి లో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగాలి.
- బేకింగ్‌సోడా, మంచినీళ్ళు సమపాళల్లో తీసుకొని గ్లాస్లో
కలుపుకుని తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
- ఒక గ్లాసు నీటిలో జీలకర్ర
వేసుకుని కాసేపు నానబెట్టి ఆ నీటిని తాగొచ్చు.
- తాజా కొత్తెమీర ఆకులతో జ్యూస్
చేసి దానిలో చిటికెడు ఉప్పు కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు
తీసుకొవాలి.
- భోజనం తర్వాత ఒక కప్పు
అల్లంటీ తీసుకోవడం వల్ల అజీర్తి సమస్య తగ్గుతుంది.
- 250 మి.లీ నీటిలో ఒక టీ స్పూన్ మెంతులను వేసి నీరు
సగానికి ఇంకే వరకు మరిగించి ఆకషయాన్ని తాగాలి. ఇలా రోజుకు నాలుగుసార్లు
చేస్తే సైనసైటిస్ పూర్తిగా తగ్గుతుంది. సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు రోజుకు
నాలుగు డోసులు తీసుకుంటూ తీవ్రత తగ్గే కొద్దీ డోసుల సంఖ్యను తగ్గించుకోవాలి.
- ఒక టీ స్పూను జీలకర్రను
వేయించి పొడిచేసి అందులో రెండు టీస్పున్ల తేనె కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకు
రెండుమోతాదులో తీసుకుంటే ఫలితం ఉంటుంది. సైనసైటిస్ కారణంగా పట్టేసినట్లు
ఉంటే జీలకర్రను పలుచటి కాటన్ క్లాత్‌లో కట్టి వాసన పీలుస్తుంటే ఉపశమనం
లభిస్తుంది.
- రోజుకు ఒకసారి 300మి.లీ క్యారెట్ రసం లో 200మి.లీ. పాలకూర రసం కలిపి తీసుకుంటే సైనసైటీస్
తగ్గుతుంది.
- 300మి.లీ క్యారెట్ రసం లో వంద మిల్లీలీటర్ల
కీరదోసరసం, అంతే మోతాదులో బీట్రూట్ రసం
కలిపి తాగినా కూడా సైనసైటీస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
- ఎసిడిటీతో బాధపడుతున్న వారు, భోజనం తర్వాత లవంగంలోని చిన్న ముక్కను నోట్లో
వేసుకుని రసం మింగుతుండాలి.
- బాదం పప్పులను రాత్రంతా
నానబెట్టి, ఉదయం వాటిపై పొర తీసి పాలు, తేనెతో కలిపి ఉడకబెట్టుకుని తాగాలి. ఇలా 20-25 రోజుల పాటు చేస్తే జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
ప్రతి రోజూ ఏడు బాదం పప్పులు నేరుగా తిన్నా మంచి ఫలితం ఉంటుంది.
- ముక్కు వెంట నీరు
కారుతున్నట్టుగా జలుబు చేస్తే చేతి రుమాలులో రెండు, మూడు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ వేసుకుని వాసన చూస్తుంటే మంచి ఇన్హేలర్గా
పనిచేస్తుంది. పసుపు, యూకలిప్టస్ ఆయిల్ కలిపి
ఆవిరి పడితే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
- నోటి దుర్వాసన పోవాలంటే
ఏలకులు, లవంగ మొగ్గలను నోట్లో
వేసుకుని నములుతుండాలి.
- అల్లం రసంలో, గోరు వెచ్చని తేనె కలిపి రాత్రి పడుకునే ముందు
తీసుకుంటే ఎంత తీవ్రంగా ఉన్న దగ్గు అయినా తగ్గిపోతుంది.
- జీలకర్ర, నల్ల ఉప్పు, నిమ్మరసం గోరువెచ్చని నీటిలో కలిపి వడకట్టి రోజూ ఉదయం ఒక గ్లాసుడు
తాగితే కడుపు నొప్పి తగ్గుతుంది.
- జీలకర్ర, ధనియాలు సమపాళ్ళలో తీసుకుని, దోరగా వేయించి, పొడిచేసి, అర టీ స్పూను చొప్పున రోజుకి
మూడు సార్లు తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది.
- పుట్టగొడుగులను కేవలం ఆహారంగా
మాత్రమే కాదు.. రంగుల తయారీలోను ఉపయోగిస్తారు. సహజ రంగుల ఉత్పత్తిలో వీటి వాడకం
అధికం. ఇవి గాఢమైన రంగులను వివిధ ఛాయల్లో ఉత్పత్తి చేయడానికి పనికొస్తాయి.
- క్యాబేజీలో 91 శాతం నీరే ఉంటుంది.
- ఎన్నిరకాల పండ్లున్నా... ఒక్క
స్ట్రాబెర్రీలో మాత్రమే విత్తనాల అమరిక బయటికి కనిపించేలా ఉంటుంది.
- సోయాపిండిలో గోధుమపిండిలో
కంటే ఎక్కువ మోతాదులో కాల్షియం, ఐరన్ లభిస్తాయి.
- యాపిల్‌లో ఉండే నీటిశాతం ఎంతో
తెలుసా! అక్షరాలా.. 25 శాతం. అందుకే అది నీటిలో
తేలుతుంది.
- చూయింగ్ గమ్‌లు జీవక్రియ
వేగాన్ని నియంత్రించి 25 శాతం నాజుగ్గా ఉండటానికి
కారాణమవుతాయి.
- కాఫీ రుచి ప్రపంచం మొత్తానికి
తెలిసిన అత్యంత ప్రజాదరణ పొందిన సువాసన.
- మానవులు తీసుకునే ఆహారంలో.
ఎప్పటికీ పాడైపోని పదార్ధం తేనె.
- స్ట్రాబెర్రీలో కంటే
నిమ్మకాయల్లోనే తీపి ఎక్కువట.. తెలుసా!
- ప్రపంచవ్యాప్తంగా అతిధి
మర్యాదలకు గౌరవ సూచకంగా వాడుతున్న ఫలం అనాస.
- నెలసరి రోజుల్లో రోజుకొక
కోడిగుడ్డును ఉడకబెట్టి తింటే నీరసం, అలసట ఉండవు.
- ఆహారంలో బి విటమిన్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ సమృద్ధిగా ఉండేలా
చూసుకోవాలి. అలా సాధ్యం కానప్పుడు డాక్టరు సలహా మేరకు అవన్నీ అందే విధంగా
మందులు వాడితే కండరాలకు తగినంత శక్తి లభిస్తుంది. రుతుక్రమం బాధ తీవ్రత
తగ్గుతుంది.
- శరీరంలో క్యాల్షియం తగినంత ఉన్నప్పుడు
ఈ సమయంలో నొప్పులు కలగవని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మహిళలు రోజుకు 800 మిల్లీ గ్రాముల క్యాల్షియం తీసుకోవాల్సి
ఉంటుంది. అందుకే రుతుక్రమం రోజుల్లోనే కాకుండా ప్రతిరోజూ మూడుకప్పుల పాలు
తాగాలి.
- గొంతు పట్టేసినట్లున్నా, దగ్గు వదలకుండా వున్నా గోరు వెచ్చటి పాలలో
చిటికెడు మిరియాల పొడి కలిపి తాగాలి. ఇలా ఉదయం, సాయంత్రం, రాత్రి తీసుకుంటే రెండు
రోజుల్లో బాధ తగ్గుతుంది.
- వదలకుండా ముక్కు కారుతుంటే
గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు లేదా ఒక వెల్లుల్లి రేకను చిదిమి వేసుకుని
తాగాలి.
- చలికాలంలో పిల్లలకు తరచుగా
మందులు వేయడం కంటే నాలుగైదు రోజులకొకసారి ఒక టీ స్పూను వాము పొడిని
తినిపిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారు.
- పాలకూర రసం తాగినట్లయితే
జుట్టు బాగా పెరుగుతుంది. పాలకూర రసం తాగడానికి ఇబ్బందిగా అనిపిస్తే అరకప్పు
క్యారెట్ రసంలో అరకప్పు పాలకూర రసం కలుపుకుని తాగవచ్చు.
- ఆహారంలో ఎక్కువ భాగం
ఆకుపచ్చని కూరగాయలు, పాలు, పండ్లు, మొలకెత్తిన ధాన్యాలు, 'వెజిటబుల్, ఫ్రూట్ సలాడ్లు' తీసుకుంటుంటే జుట్టురాలడం
తగ్గడమే కాకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది కూడ.
- ఒబెసిటీతో బాధపడుతుంటే బరువు
తగ్గడం కోసం ఆహార నియంత్రణ పాటించడం కోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరంలేనట్లే
ఉంది ఈ ఆక్యుప్రెషర్ చిట్కాలను చూస్తే. శరీరంలో ప్రెషర్ పాయింట్లను
గుర్తించి కరెక్ట్‌గా అక్కడ ఒత్తిడి కలిగించే చిన్నపాటి వ్యాయామం ద్వారా
ఆకలిని అదుపు చేయవచ్చు. పై పెదవి మధ్యభాగంలో, ముక్కుకు కింది భాగంలో, నాభికి ఒక అంగుళం కింద, ఒక అంగుళం పైన వేళ్ళతో నొక్కాలి. ఇలా రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు
చేయాలి. ఒక్కొక్కసారి ఐదు నిమిషాలపాటు చేయాలి.
- ఆహారాన్ని బాగా నమిలి తినే
అలవాటున్న వాళ్ళలో ఒబేసిటీ తక్కువగా చూస్తాం. నమలకుండా మింగే అలవాటుండి, ఒబెసీటీతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పటికైనా
ఆహారాన్ని నమిలి తినడం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటున్నారు
నిపుణులు. నోట్లో పెట్టుకున్న పదార్ధం మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు నమలడం
అలవాటు చేసుకుంటే తిన్న ఆహారంలోని పోషకాలు సక్రమంగా శరీరానికి అందడంతోపాటు
ఒబేసిటీ కూడా తగ్గుతుంది. ఎక్కువ సేపు నమలడం ద్వారా ఎక్కువ పరిమాణంలో ఆహారాన్ని
తీసుకోలేరు, పైగా శరీరానికి తగినంత
తినగానే జీర్ణవ్యవస్థ ఇకచాలని హెచ్చరికలు జారీ చేస్తుంది.
- టొమాటో రసం కాని గుజ్జు కాని
ముఖానికి పట్టించి గంట తర్వాత కడిగేస్తే మొటిమలు, మచ్చలు పోతాయి. ముఖం మీద అదనపు జిడ్డు తొలగిపోతుంది.
- పుదీనా ఆకులను గ్రైండ్ చేసి
క్రమం తప్పకుండా ముఖానికి పట్టిస్తుంటే నెల రోజులకు మొటిమలు పూర్తిగా పోతాయి.
- ఏ ఫేస్ ప్యాక్‌లోనయినా తేనె
కలుపుకోవచ్చు. తేనె ముఖంపై ముడతలను పోగొట్టడంతోపాటు చర్మాన్ని కాంతివంతం
చేస్తుంది.
- కొత్తిమీర రసంతో మర్దన చేస్తే
పెదవులు ఎర్రబడతాయి, మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
- ప్రకృతి ప్రసాదించిన
వనమూలికలతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని నిరూపించారు భారాతీయ వైద్యులు. వీటిలో
అల్లం ప్రాధాన్యం మరీ ఎక్కువ. ముఖ్యంగా పసిపిల్లలున్న ఇంట్లో అల్లం, శొంఠి ఉండడం ఆనావాయితీ.
- పిల్లలకు అజీర్తి, కడుపునొప్పి వస్తే ఒక స్పూను అల్లం రసం కాని
చిటికెడు శొంఠి పొడికాని ఇవ్వాలి. పెద్దవాళ్ళు కూడా మోతాదు పెంచి
తీసుకోవచ్చు.
- జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం
ముక్కలు కాని, శొంఠిపొడి కాని కలిపి
తీసుకోవాలి.
- తలనొప్పి, జ్వరం ఉన్నప్పుడు అల్లంరసం కాని, అల్లం టీ కాని తాగితే ఉపశమనం కలుగుతుంది.
- పైత్యంతో వాంతులవుతుంటే
శొంఠిని తేనెతో కలిపి చప్పరించాలి.
- వేవిళ్ళ సమయంలో అయ్యే వాంతుల
నివారణకు కూడా అల్లం బాగా పనిచేస్తుంది. నోరు రుచి లేనట్లు ఉండడాన్ని
పోగొడుతుంది.
- జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు రోజుకు మూడుసార్లు, అల్లంతో తయారైన హెర్బల్ టీని తాగచ్చు. అయితే
రోజులో నాలుగుసార్లకు మించి అల్లం టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు. మరీ
ముఖ్యంగా కడుపులో అల్సర్ ఉన్న వాళ్ళు అసలు తాగకూడదు.
- అల్లం టీ తాగినప్పుడు
ఆహ్లాదంగా అనిపించకుండా కడుపులో వికారం కాని మరే సైడ్ ఎఫెక్ట్ కనిపించినా
అల్సర్ వంటి సమస్యలున్నాయేమోనని డాక్టర్ని సంప్రదించడం అవసరం.
- రెండు టీ స్పూన్ల గోరు
వెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్ అల్లం రసం కలిపి తాగితే గ్యాస్ బాధ
తగ్గుతుంది.
- అజీర్తి చేస్తే శొంఠి పొడిలో
నెయ్యి, బెల్లం కలిపి ఉండలు చేసి రోజూ
ఉదయం, రాత్రి భోజనం చేసిన తర్వాత తింటే జీర్ణక్రియ సక్రమమవుతుంది.
- శొంఠిపొడి, నెయ్యి, బెల్లం, వెన్న కలిపి తింటే శరీర
జీవరక్షక వ్యవస్థ మెరుగవుతుంది.
- అరగ్రాము ఏలకుల పొడిలో ఒక టీ
స్పూన్ కలిపి తింటే వాంతులు, వికారం తగ్గుతాయి.
- సోడాలో చిటికెడు మిరియాల పొడి
కలిపి తాగితే వాంతులు అదుపులోకి వస్తాయి.
- ఒక గ్లాసుపాలలో ఒక టీ స్పూన్
నెయ్యి కలిపి తాగితే అసిడిటీ తగ్గుతుంది.
- రోజూ ఐదు గ్రాముల త్రిఫల
చూర్ణాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత తాగితే కొవ్వు
కరిగిపోతుంది. బరువు తగ్గుతారు.
- బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఒక
పద్ధతి లేకుండా ఆహార నియమాలు పాటించడం వల్ల అనుకున్న ఫలితాలు రాకపోగా ఆరోగ్య
సమస్యలు తలెత్తుతాయి.
- కఠిన ఉపవాసం ఉండటం, తగ్గించి తినడం మంచిది కాదు. ఇలా చేస్తే
శరీరంలోని జీవ రక్షక వ్యవస్థ (మెటబాలిజం) దెబ్బతింటుంది.
- ఎక్కువ సేపు తినకుండా గ్యాప్
ఇచ్చి ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం సాధారణంగా చేసే పొరపాటు.
బరువు తగ్గాలంటే తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి.
- భోజనం చేసేటప్పుడు మనసు
తినేదాని మీదే కేంద్రీకరించాలి. టీవీ చూస్తూ, పుస్తకం కాని పేపర్కాని చదువుతూ, కబుర్లు చెప్పుకుంటూ తినే అలవాటు మానుకోవాలి. ఏం తింటున్నామో? ఎంత తింటున్నామన్నది తెలియకుండా ఎక్కువ తినేది
ఇలాంటప్పుడే. మెదడు ఇతర విషయాల మీద కేంద్రీకృతమై ఉన్నప్పుడు సరిపడినంత
తిన్నామన్న సంకేతాలను పంపించదు. 'ఏంటో
మీతో మాట్లాడుతూ ఎక్కువ తినేశా. బాగా హెవీగా ఉంది.' అనే మాట అప్పుడప్పుడు వింటుంటాం. అది ఇదే.
- డయాబెటిస్‌ను కంట్రోల్
చేయడానికి సోయాబీన్ బాగా పని చేస్తుంది. పోషకాలు మెండుగా ఉండి తేలిగ్గా
జీర్ణమయ్యే ఆహారంగా సోయాబీన్‌ను ప్రపంచ వ్యాప్తంగా న్యూట్రిషనిస్టులు
గుర్తించారు.
- పెరిగే పిల్లలకు సోయాబీన్
మంచిపోషణనిస్తుంది. దేహదారుడ్యానికి, పెరుగుదలకు దోహదం చేస్తుంది.
- శరీరం పెరుగుదలతోపాటు మెదడును
వికశింప చేస్తుంది.
- క్రమం తప్పకుండా సోయాబీన్
తింటే శరీరంలో కొలెస్ట్రాల్ నిల్వలు చేరవు. ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్‌ను
కరిగించి వేస్తుంది.
- ఆర్ధరైటిస్, గుండె, మెదడు, కిడ్నీలు, కళ్ళ సమస్యలను దూరం చేస్తుంది.
- వ్యాయామం శక్తికి మించి
చేయకూడదు.
- వ్యాయామం చేస్తున్నంతసేపు
వేరే ఏ ఆలోచనలు చేయకూడదు.
- ఖాళీ కడుపుతో వ్యాయామం చేయడం
కంటే ఒక కప్పు పాలు లేదా ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగి కాని ఒక పండు తిన్న
తర్వాత కాని వ్యాయామం చేయడం మంచిది.
- ఆయుర్వేదం ప్రకారం యోగాసనం, ప్రాణాయామం చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఇవి
శరీరాన్ని మనసును ఏకకాలంలో సాంత్వన పరుస్తాయి.
- బ్రిస్క్ వాక్ కూడా మంచి
వ్యాయామం.
- వ్యాయామం చేసేటప్పుడు పూర్తి
శ్రద్ధతో చేయాలి తప్ప బలవంతంగా చేయకూడదు. ఇష్టపూర్వకంగా చేయకుండా మొక్కుబడిగా
అయిందనిపిస్తే శరీరం సానుకూలంగా స్పందించదు.
- కాకరకాయలు, ములక్కాయలు బరువు పెరగకుండా కాపాడతాయి. బరువు
అదుపులో ఉంచుకోవాలన్నా, తగ్గాలన్నా ఆహారంలో వీటిని
తరచుగా తినవచ్చు.
- తేనెకు కొవ్వును కరిగించే
గుణం ఉంది. క్రమం తప్పకుండా తీసుకుంటే అధిక బరువును తగ్గిస్తుంది.
- తేనె, నిమ్మరసం తీసుకుంటూ ఉపవాసం ఉంటే ఒంట్లో ఉన్న కొవ్వు త్వరగా కరగడం
ప్రారంభమవుతుంది. ఒక టీ స్పూన్ తేనె, ఒక నిమ్మ చెక్క ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇలా
రోజులో ఎన్నిసార్లయినా తాగవచ్చు.
- పని ఒత్తిడిలో బ్రేక్‌ఫాస్ట్
తీసుకోకుండా ఒకేసారి మధ్యాహ్న భోజనం చేసే అలవాటు గృహిణులలో చాలామందికి
ఉంటుంది. ముఖ్యంగా బరువు తగ్గడం కోసం డైటింగ్ చేసేవాళ్ళు ఇలా చేస్తుంటారు.
దీనితో బరువు తగ్గడం కంటే ఇతర శరీర సమస్యలను ఎదుర్కొనవలసి రావచ్చు. రోజూ
తప్పని సరిగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవాలి. ఆహారం తీసుకోవాల్సిన క్రమంలో ఒకటి
మిస్ అయినా శరీరంలో జీవరక్షణ దెబ్బ తింటుంది.
- చిన్నపిల్లలకు మాంసాహారం
అలవాటు చేసేటప్పుడు చేపలను తినిపించడం మంచిది. నమలడంతో పాటు ఇవి జీర్ణం కావడం
కూడా సులభం. పిల్లలకు రెండవ సంవత్సరం నుంచి వారి ఆహారంలో చేపలను చేర్చవచ్చు.
- పిల్లలకు మొదటిసారి కొనే షూ
తేలికగా ఉండేలా చూడాలి. పాదాలకు గాలి తగిలే విధంగా లెదర్ లేదా క్లాత్‌తో
తయారైనది మాత్రమే వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ సోల్ ఉన్న వాటి
జోలికి వెళ్ళకూడదు.
- డయేరియాతో బాధపడే పిల్లలకు
శరీరంలో నీటి శాతం త్వరగా తగ్గుతుంది. శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా
చల్లటి నీటిలో చక్కెర, ఉప్పు కలిపి తరచుగా
పట్టించాలి. దీనికి బదులుగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ప్యాకెట్‌ను నీటిలో
కలిపి తాగించాలి. ఇవి అన్ని మందుల దుకాణాలలోనూ దొరుకుతాయి.
- సోడాలో చిటికెడు ఉప్పు, మిరియాలపొడి కలిపి తాగితే గ్యాస్ట్రిక్ సమస్య
తగ్గుతుంది.
- విషపురుగు కరిచినప్పుడు
కరివేపాకు కాయలరసం, నిమ్మరసం సమపాళ్ళలో కలిపి
గాయం మీద రాస్తే విషం హరిస్తుంది.
- ధనియాల పొడిలో చక్కెర కలిపి
రోజుకు రెండు మూడు సార్లు తినిపిస్తే పిల్లలో పక్క తడిపే అలవాటు పోతుంది.
- రోజుకు ఒకసారి రెండు - మూడు
ఏలకులను ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తింటే కళ్ళు లాగడం వంటి సమస్యలు
తగ్గుతాయి.
- దోమల లాంటివి కుట్టినప్పుడు ఆ
ప్రదేశంలో సబ్బు రాస్తే దురద తగ్గి తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది.
- రెండు టేబుల్ స్పూన్ల
కొబ్బరి నూనెలో కొద్దిగా కర్పూరం వేసి వేడిచేసి చిన్నపిల్లల ముక్కుపై, వెన్నుపై మసాజ్ చేస్తే జలుబు, జ్వరానికి ఉపశమనం కలుగుతుంది.
- శొంఠి పొడిని ఏలకులు, తేనె లేదా చక్కెరతో కలిపి తింటే దగ్గు నుంచి
ఉపశమనం లభిస్తుంది.
- జలుబుతో బాధపడుతుంటే తేనె
కలిపిన నిమ్మరసం తీసుకోవాలి.
- నోటి నుంచి దుర్వాసన వస్తుంటే
రోజూ ఉదయాన్నే ఐదు గ్లాసుల నీళ్ళు తాగాలి.
- జఠాహంపి వేర్లను మెత్తగా దంచి
పొడి చేసి రోజూ రెండు గ్రాముల పొడి నీళ్ళలో కలిపి తాగితే రక్తం
శుభ్రపడుతుంది. మొటిమలు తగ్గుతాయి. ముఖం, శరీరం కాంతివంతమై చర్మవ్యాధులు తగ్గుతాయి.
- శొంఠిపొడి, నెయ్యి, బెల్లం సమపాళ్ళలో కలిపి ఉదయాన్నే తింటే జలుబు తగ్గుతుంది.
- మిరియాల పొడి పావు టీ స్పూన్, శొంఠిపొడి అర టీ స్పూన్, తులసి ఆకుల పొడి అర టీ స్పూన్ కాని తాజా ఆకులు
నాలుగైదు తీసుకుని ఒక గ్లాసు నీటిలో వేసి నీళ్ళు సగానికి ఇంకే వరకు
మరిగించాలి. ఈ టీని రోజుకు రెండు మూడుసార్లు తాగితే జలుబు పూర్తిగా
వదిలిపోతుంది.
- అల్లం టీ ఆరోగ్యానికి మంచిదే
కాని ప్రతి రోజు తాగకూడదు. జీర్ణవ్యవస్థ సొంతంగా తన పని తాను చేయడానికి
అవకాశం ఇవ్వాలి.
- రోజూ క్రమం తప్పకుండా పసుపు
కడుపులోకి చేరితే రింగ్ వార్మ్స్ చేరవు. కడుపులో నులిపురుగులు
ఉన్నట్లనిపిస్తే ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిలో అరటీ
స్పూను ఉప్పు, చిటికెడు పసుపు కలుపుకుని
తాగాలి.
- వేయించిన జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసి మజ్జిగలో కలిపి తాగితే డయేరియా
తగ్గుతుంది.
- బాగా దగ్గు వస్తున్నప్పుడు
సత్వరమే తగ్గడానికి కరక్కాయను బుగ్గన పెట్టుకుని కొద్దికొద్దిగా రసం మింగితే
ఫలితం ఉంటుంది.
- పంటినొప్పి నుంచి ఉపశమనం
పొందాలంటే రెండు చుక్కల లవంగ నూనెను దూదిమీద వేసి నొప్పి ఉన్న చోట పెట్టాలి.
లవంగ నూనెకు బదులుగా లవంగం కూడా వాడొచ్చు.
- కొత్త చెప్పులు నొక్కుకుని
కాయలు కాసిన చోట నిమ్మచెక్కని ఉంచి కట్టుకట్టి రాత్రంతా ఉంచాలి.
- జిగట విరేచనాలు అవుతుంటే
రెండు స్పూన్ల పెరుగులో ఒక స్పూను మెంతులు వేసి తింటే విరేచనాలు తగ్గుతాయి.
- ఉదయాన్నే మొదటగా ఒక గ్లాసు
గోరువెచ్చటి నీటిలో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి తాగాలి. ఇది
జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. కెఫీన్ ఉన్న పదార్ధాలు ఆరోగ్యానికి హాని
చేస్తాయి.
- ఉపాహారంగా నూనె లేకుండా వండిన
తేలికగా జీర్ణమయ్యే పదార్ధాలనే తీసుకోవాలి. ఇది రోజువారీ పనులను ఉల్లాసంగా
చేయడానికి పనిచేస్తుంది.
- నిద్రపోయే ముందు ఒక గ్లాసు
వేడిపాలలో కొద్దిగా శొంఠిపొడి, ఏలకుల పొడి వేసుకుని తాగాలి. అల్లం అయితే కఫాన్ని తొలగిస్తుంది.
- ఆహారంలో ఆకుకూరల వంటి పీచు
పదార్ధాలు మెండుగా ఉన్నవి తినడానికి వీలుకానప్పుడు తొక్కతో సహా తినగలిగిన
పండును తప్పని సరిగా చేర్చాలి.
- మధ్యాహ్నం రెండు గంటల లోపే
గట్టి ఆహారం తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకునేవన్నీ తేలికగా జీర్ణమయ్యేవిగా
ఉండాలి. రాత్రి భోజనం వీలైనంత తక్కువగా ఉండాలి.
- డయాబెటిస్ అదుపులో ఉండడానికి
క్రమం తప్పకుండా రోజుకు నాలుగైదు మిరియాలు తినాలి.
- లో బిపి సమస్య ఉంటే రోజూ
ఉదయాన్నే మూడు మిరియాలు తింటే రక్త ప్రసరణ క్రమబద్ధం అవుతుంది.
- రోజూ ఆహారంలో మిరియాలు కాని
మిరియాలపొడి కాని తీసుకుంటే అది రక్తంలో కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది.
రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది.
- గొంతు ఇన్ఫెక్షన్ తగ్గాలంటే
ఒక టీ స్పూన్ తాజా అల్లం రసం లేదా చిన్న అల్లం ముక్క, చిటికెడు మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి ఉదయం ఒక సారి రాత్రి పడుకోబోయే
ముందు ఒకసారి తినాలి.
- కాఫీ, టీలు ఉత్తేజాన్నిచ్చే పానీయాలుగా తెలుసు. అలాగని ఎక్కువ మోతాదులో
తీసుకుంటే క్రమంగా ఆరోగ్యసమస్యలను సృష్టిస్తాయని కూడా తెలుసు. గ్రీన్ టీ
తాగితే మెదడు ఉత్తేజితం కావడంతోపాటు ఆరోగ్యం మెరుగవుతుంది కూడ.
- చైనాలో దాదాపుగా నాలుగు వేల
సంవత్సరాలుగా దీనిని అనేక అనారోగ్యాలను దూరం చేసే ఆరోగ్యప్రదాయినిగా
వాడుతున్నారు. ఇందులో కేట్చిన్ పాలీఫెనోల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి యాంటీ
ఆక్సిడెంట్లుగా పని చేసి క్యాన్సర్ కణాలను చంపడంలో సమర్ధంగా పనిచేస్తాయి.
శరీరంలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తాయి.
- గ్రీన్ టీ అంటే మనం మామూలుగా
తాగే పౌడర్‌తోనే పాలు లేకుండా చేసేది మాత్రమే అనుకుంటే పొరపాటే. ప్రధానంగా
ఆకు ఒకటే అయినా పౌడర్ తయారీలో తేడా ఉంటుంది. మార్కెట్లో గ్రీన్ టీ పౌడర్
ప్రత్యేకంగా దొరుకుతుంది.
- ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల
కిడ్నీలో రాళ్ళ సమస్య తగ్గుముఖం పడుతుంది. సాధ్యమైనప్పుడు తాజా పండును
తీసుకుంటూ, సాధ్యం కానప్పుడు దానికి
ప్రత్యామ్నాయంగా ఆపిల్ సైడర్ వెనిగర్‌ను తీసుకోవచ్చు.
- అన్ని రకాల పండ్లలోకి
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ. పైగా ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబటి
పుచ్చకాయ కిడ్నీ సమస్యలను సమర్ధంగా నివారిస్తుంది. ఇవి అందుబాటులో ఉన్న సీజన్లో
వీలయినంత ఎక్కువగా తీసుకుంటే మంచిది. కిడ్నీ సమస్య దరి చేరకుండా ఉండడానికి
ఆపిల్‌కు ప్రత్యామ్నాయంగా పుచ్చకాయ బాగా పని చేస్తుంది.
- రుతుక్రమంలో అపసవ్యతలతో
బాధపడుతుంటే ఒక టీ స్పూన్ వెన్నను కరిగించి అందులో పావు టీ స్పూన్
ఇంగువను(పౌడర్ లేదా చిన్న ముక్క) వేయించాలి. దీనిని ఒక గ్లాసు మజ్జిగలో కాని
ఇతర సూప్‌లు లేదా డ్రింకులతో కాని కలిపి తీసుకోవాలి.
- లో బిపి ప్రాబ్లమ్ ఉన్నవారు
రాత్రి పడుకునే ముందు ఎప్సమ్ సాల్ట్ నీటిలో వేసుకుని స్నానం చేస్తే బ్లడ్
ప్రెజర్ క్రమబద్ధమౌతుంది.
- నాలుగు ఎండు అత్తిపళ్ళను
రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటితో సహా తీసుకోవాలి. ఇలాగే ఇదే మోతాదులో
ఉదయం నానబెట్టి సాయంత్రం తినాలి. ఇలా మూడు నుంచి నాలుగు వారాల పాటు తింటే
పైల్స్ సమస్య అదుపులోకి వస్తుంది. పండ్లను నానబెట్టే ముందు వేడినీటితో
శుభ్రం చేయాలి.
- మామిడి టెంకలో ఉండే జీడిని
నీడలో ఎండబెట్టి పొడిచేసి, రెండుగ్రాముల పొడిని నీటితో
కాని తేనెతో కాని తీసుకోవాలి. బ్లీడింగ్ పైల్స్‌కు ఇది బాగా పని చేస్తుంది.
ఈ పొడి ఒకసారి చేసుకుని నిల్వ చేసుకోవచ్చు.
- వంద గ్రాముల ముల్లంగిని
తురిమి, ఒక టీ స్పూన్ తేనె కలిపి
రోజూ రెండుసార్లు తీసుకోవాలి. 60 మి.లీ ముల్లంగి రసంలో ఉప్పు కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి.
ముల్లంగిని మెత్తగా పేస్టు చేసి పాలతో కలిపి తీసుకోవచ్చు. ఇది వాపు, నొప్పితో కూడిన పైల్స్‌ను కూడా తగ్గిస్తుంది.
- కిడ్నీలో రాళ్ళు ఉండి
బాధపడుతుంటే ప్రతిరోజూ ఆపిల్ తినడం వల్ల సమస్య తగ్గుతుంది. సాధ్యమైనప్పుడు
తాజా ఆపిల్ తీసుకుంటూ దొరకనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఆపిల్ సైడర్
వెనిగర్‌ను తీసుకోవచ్చు.
- ఒక టీ స్పూన్ వెన్నను
కరిగించి అందులో పావు టీ స్పూన్ ఇంగువ కలిపి వేయించాలి. దీనిని ఒక గ్లాసు
మజ్జిగలో కాని ఇతర సూప్‌లు లేదా డ్రింకులతో కలిపి తీసుకుంటే రుతుక్రమంలో
అపసవ్యతలు క్రమబద్ధం అవుతాయి.
- పిప్పిపన్నుకి లవంగం పెడితే
నొప్పి తగ్గుతుంది. లవంగనూనె వేస్తే పిప్పికి కారణమైన బ్యాక్టీరియా
నశిస్తుంది. దీనిని స్వయంగా చేయడం కంటే నిపుణుల చేత చేయించుకుంటే మంచిది.
- కడిపులో గ్యాస్ ఉత్పత్తి
అవుతూ తరచుగా త్రేన్పులు వస్తుంటే ఐదు రోజులకొకసారి ఉదయం పరగడుపున అరకప్పు
నీటిలో ఒక టీ స్పూన్ వెనిగర్ కలిపి తాగాలి.
- అర టీ స్పూను ఆవపొడిలో మూడు
టీ స్పూన్ల నీరు కలిపి ఈ మిశ్రమాన్ని ముక్కు రంధ్రాల్లో వేసుకోవాలి. ఈ చిట్కా
మైగ్రేన్‌ను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.
- బాగా వేడి చేసినప్పుడు కూడా
తలనొప్పి వస్తుంది అలా వచ్చినప్పుడు పుచ్చకాయ రసంలో పంచదార కలుపుకుని
తీసుకోవాలి.
- రెండు ముక్కు రంధ్రాల్లోను
కరిగించిన నెయ్యికాని, పెరుగుగాని 2-4 చుక్కలు వేసుకోవాలి. ఇలా వారం రోజులపాటు క్రమం
తప్పకుండా చేయాలి.
- గ్లాసు నీటిలో ఒక టీ స్పూను
తేనె కలుపుకుని ఉదయాన్నే తీసుకోవాలి. దీర్ఘకాలికంగా తలపోటు ఉన్నవారికి ఇది
మంచి చిట్కా.
- దీర్ఘకాలికంగా తలపోటుతో
బాధపడే వాళ్ళు ప్రతి రోజూ ఉదయం ఒక తాజా ఆపిల్‌ని తీసుకోవడం మంచిది. ఇలా కనీసం
వారం రోజులైనా చేయాలి.
- అల్లంపొడిని కొద్దిగా
వేడిచేసి మెత్తటి వస్త్రంలో చుట్టి నుదుటిపై కాపడం పెట్టుకోవడం వల్ల కూడా
ప్రయోజనం ఉంటుంది.
- గంధపు చెక్కతో తీసిన తాజా
గంధాన్ని నుదుటిపై రాసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చేతితో రబ్ చేసి నీటితో
కడగాలి. ఈ చిట్కా పాటించడం చాలా సులభం, నొప్పి కూడా త్వరగా పోతుంది.
- కొబ్బరినీళ్లు, చెరుకురసం సమపాళల్లో కలుపుకుని తాగితే తలపోటు
నుండి ఉపశమనం కలుగుతుంది.
- బేకింగ్ సోడాకు, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని బాహుమూలాల వద్ద
రాసుకుంటే దుర్వాసన తగ్గుతుంది.
- 30మి.లీ నీటిలో పది చుక్కలు ఎసన్షియల్ ఆయిల్
వేసి బాహుమూలాల వద్ద రాసుకోవాలి.
- డీయోడరెంట్లు బదులు చెమట
ఎక్కువగా పట్టే ప్రదేశంలో బేబీ పౌడర్ లేదా టాల్కమ్ పౌడర్ రాసుకోవాలి.
- స్నానానికి ఉపయోగించే నీటిలో
కొన్ని చుక్కలు రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఇలా చేస్తే ఎలాంటి డీయోడరెంట్లు
వాడనవసరం లేదు. ఇది చర్మాన్ని శుభ్రం చేస్తుంది.
- బాహుమూలాలను వెనిగర్‌తో
శుభ్రం చేఉకోవాలి.
- ప్రతిరోజూ పరగడుపున 500 మి.గ్రాల గోధుమ గడ్డిని గ్లాసు నీటితో
తీసుకోవాలి. దీనిలో ఉండే క్లోరోఫిల్ శరీరం నుండి వచ్చే చెడు వాసనను
తగ్గిస్తుంది.
- డయేరియా వంటి
వ్యాధులున్నప్పుడు, వచ్చి తగ్గిన వెంటనే కూడా
స్విమ్మింగ్ చేయకూడదు. సంబంధిత బ్యాక్టీరియా నీటిలో చేరి తర్వాత పుల్లో
దిగిన వాళ్లకు సోకే అవకాశం ఉంటుంది.
- పూల్‌లోని నీటిని మింగకూడదు.
పిల్లలు నీటిలో ఉక్కిరిబిక్కిరి అయినప్పుడు నీటిని మింగేస్తారు. అలా జరిగిన
రోజే డాక్టరును సంప్రదించి ఇన్ఫెక్షన్ సోకకుండా ముందస్తుగా వేసుకునే మందులు
వాడాలి.
- ఎండాకాలం వచ్చినదంటే
స్విమ్మింగ్ పూల్స్ నిండుగా కనిపిస్తాయి. ఈత దేహానికి చక్కటి వ్యాయామం
మాత్రమే కాక ఎండ నుంచి చక్కటి సాంత్వన కూడా కలుగుతుంది. పైగా పిల్లలకు
సెలవులు వచ్చేస్తాయి. ఇవన్నీ కలిసి అందరినీ స్విమ్మింగ్ పుల్స్ వైపు
అడుగులు వేయిస్తాయి. జాగ్రత్తలు తీసుకోకుంటే కొన్ని ప్రత్యేకమైన రుగ్మతుల
బారిన పడే ప్రమాదముంది.
- మహిళలకు ఎదురయ్యే గర్భాశయంలో
ట్యూమర్స్ వంటి సమస్యల నుంచి రక్షించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
గర్భాశయంలో అనవసర టిష్యూల పెరుదలను నిరోధిస్తుంది.
- ఇందులో ఉండే లైకోపిన్
సమర్ధమైన యాంటీ ఆక్షిడెంట్. ఇది క్యాన్స్ర్ కారక సెల్స్‌ను నివారించడంలో
బాగా పని చేస్తుంది.
- ఇందులో విటమిన్ కె సమృద్ధిగా
ఉంటుంది కాబట్టి రక్తం గడ్డకట్టని సమస్యతో బాధపడే వాళ్లు క్రమం తప్పకుండా
ఆహారంలో టొమాటోను చేర్చుకోవాలి.
- వీటిలోని నికోటినిక్ యాసిడ్
బ్లడ్‌లో కొలెస్ట్రాల్ స్ధాయిని తగ్గిస్తుంది. ఈ కారణంగా గుండె సంబంధిత
వ్యాధులు రాకుండా ఉంటాయి.
- నేచురల్ యాంటీసెప్టిక్‌గా
పనిచేసి ఇన్ఫెక్షన్లను రానీయకుండా నివారిస్తుంది.
- లివర్ సిర్రోసిస్ సమస్యను
రాకుండా నివారిస్తుంది.
- ఇందులో యాంటి ఆక్సిడెంట్లు
పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం లోని ఫ్రీరాడికల్స్‌ను నియంత్రించి ఆరోగ్యానికి
కాపాడడానికి సహకరిస్తాయి. క్యాన్సర్ వంటి రోగాలను నివారిస్తాయి.
- రక్తనాళాలు, గుండె గదులు పటిష్టమవుతాయి. గుండె సంబందిత రోగుల
మీద చేసిన పరిశోధనలో ఈ విషయం స్పష్టమైనది. కరోనరీ హార్ట్ డిసీజ్ పేషెంట్స్‌కు
మూడు నెలల పాటు రోజుకు 250మి.లీ దానిమ్మరసం
ఇచ్చినప్పుడు వారిలో రక్తనాణాల పనితీరు, రక్త ప్రసరణ 17 శాతం వృద్ధి చెందినట్లు
ఇటలీలోని హెల్త్ యూనీవర్సిటీ నిర్ధారించింది.
- కీళ్ల మధ్య ఉండే జిగురు వయసు
పై బడే కొద్దీ తగ్గుతుంటుంది. దాంతో ఆస్టియో ఆర్ధరైటీస్ వంటి వ్యాధులు
వస్తుంటాయి. దానిమ్మ రసం తీసుకుంటే జిగురు తగ్గకుండా ఉంటుంది.
- ప్రోస్టేట్ క్యాన్సర్
రాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే శరీరానికి అవసరమైన రసాయనాలు క్యాన్సర్
నివారిణిగా పనిచేస్తాయి.
- ఒంట్లో ఉన్న బ్యాడ్
కొలెస్ట్రాల్‌ను అదుపు చేస్తుంది.
- బ్లడ్ ప్రెషర్‌ను
క్రమబద్దీకరిస్తుంది. హైపర్ టెన్షన్, లో బీపి సమస్యలు తగ్గుతాయి.
- ఇందులో ఎ, సి, ఇ, విటమిన్, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ పొటాషియం, నియాసిన్‌లు ఉంటాయి.
- గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ
దీనిని తీసుకుంటే పుట్టే పాపాయికి మేధోవికాసం బావుంటుంది.
- శరీరంలోని విషపదార్ధాలను
సమర్ధంగా విసర్జింపచేస్తుంది.
- కొత్త కణాల ఉత్పత్తిని
పెంచుతుంది.
- హిమోగ్లోబిన్ శాతాన్ని
పెంచుతుంది.
- గాయాలు త్వరగా మానడానికి
దోహదం చేస్తుంది.
- జీర్ణశక్తిని వృద్ది
చేస్తుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
- రక్తాన్ని శుభ్రపరిచి, రక్తప్రసరణ వ్యవస్ధ పునర్నిర్మాణానికి
సహయపడుతుంది. దీనిని గ్రైండ్ చేసి రసాన్ని రోజూ తాగవచ్చు. దీనిని మిక్సీలో
కాని బ్లెండరులో కాని వేస్తే అందులోని ఔషద గుణాలు పోతాయి. చేత్తో నలపడం
ద్వారా కాని, రాతి గ్రెండర్ లేదా
రుబ్బురోలు వాడాలి. ఎలక్ట్రానిక్ జ్యూసర్ కూడా వాడవచ్చు.
- గడ్డిలో కొద్దిగా నీటిని వేసి
గ్రెండ్ చేయాలి. పేస్టులా వచ్చిన తరువాత కొద్దిగా నీటిని కలిపి రసం
తీసుకోవాలి. తిరిగి అదే గడ్డిలో మరికొంత నీటిని కలిపి గ్రెండ్ చేసి రసం
పిండాలి. ఇలా గడ్డిలోని పచ్చదనం పోయి తెల్లగా వచ్చేవరకు చేయాలి. ఈ రసాన్ని
రోజుకు ఒక గ్లాసు తీసుకుంటే పైన చప్పిన ప్రయోజనాలన్నీ అందుతాయి.
- పైనాపిల్ తరచుగా తీసుకుంటే
మలబద్ధకం దరిచేరదు. ఇర్రెగ్యులర్ బొవెల్ మూవ్‌మెంట్‌కు ఇది చక్కటి మందు.
- పైనాపిల్ దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జ్యూస్
తాగడానికంటే ముక్కలుగా తీసుకుంటే మంచిది. రోజూ ఒక కప్పు పైనాపిల్ ముక్కలు
తింటే పై ప్రయోజనాలన్నీ సొంతమవుతాయి.
- ఇందులో కొవ్వు పదార్ధాలు
ఉండవు. శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి డైటింగ్ చేసే వాళ్ళు
నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
- పైనాపిల్‌లో సి విటమిన్, బ్రొమెలైన్ ఎంజైమ్ ఉంటాయి. మ్యూకస్‌ను
పలుచబరిచి బ్రాంకైటిస్, డిఫ్తీరియా, గుండెపట్టేసినట్లు ఉండడం వంటి వ్యాధులను
నివారిస్తాయి.
- పేగులలో ఉండే సన్నని
పురుగులను పైనాపిల్ పూర్తిగా హరిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే పేగులను, కిడ్నీలను శుభ్రపరుస్తుంది.
- భోజనం చేసిన ప్రతిసారీ
కొద్దిగా బెల్లం ముక్కను నోట్లో పెట్టుకుని రసాన్ని మింగుతూ ఉండాలి.
- గ్లాస్ మంచినీటిలో టీ స్పూన్
బేకింగ్ సోడా కలుపుకుని తాగాలి.
- గ్లాస్ నీటిలో టీ స్పూన్
జీలకర్ర వేసి మరగకాచి తాగుతూ ఉన్నా సమస్య తగ్గుముఖం పడుతుంది.
- రోజుకు మూడు, నాలుగుసార్లు కొబ్బరి నీళ్ళు తాగాలి.
- టీ స్పూన్ అల్లంరసంలో అర టీ
స్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపి రోజుకు
మూడుసార్లు తీసుకుంటే సమస్య ఉండదు.
- అరగ్లాస్ పాలను వేడిచేసి
అందులో పావు టీ స్పూన్ పసుపు, పంచదార కలిపి వెచ్చగా ఉన్నప్పుడే తాగాలి.
- చూయింగ్ గమ్ నములుతూ ఉన్నా
ఎసిడిటీ సమస్య రాదు.
- బొప్పాయి గింజలతో తయారయిన టీ
రోజుకు 6-7 సార్లు తీసుకోవాలి. ఇలా రెండు
నుండి మూడు వారాలు తీసుకోవడం వల్ల కీళ్ళనొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
- వెల్లుల్లి రేకులను వెన్నలో
వేయించి తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి.
- ఒక టీ స్పూన్ పసుపును వేడి
నీటిలో కలుపుకుని కనీసం రోజుకు మూడు సార్లు తీసుకోవడం వల్ల కీళ్ళవాతం కొంత
వరకు తగ్గుతుంది.
- పళ్ళన్నింటిలోనూ అరటి పండు
కీళ్ళ నొప్పులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇది బలాన్ని ఇస్తుంది.
- క్యారట్ జ్యూస్ ఎక్కువగా
తీసుకోవడం వల్ల లిగమెంట్స్‌కు బలం చేకూరుతుంది.
- రాత్రి పడుకునే ముందు గోరు
వెచ్చని వెనిగర్‌తో జాయింట్స్ దగ్గర రబ్ చేసుకోవాలి.
- గోముఖాసనం వేయడం అలవాటు
చేసుకోవడం వల్ల కీళ్ళనొప్పులను దూరం చేసుకోవచ్చు.
- ఊబకాయం తగ్గించడంలో తేనె ఒక
అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ తేనెను గోరు వెచ్చని నీటిలో కలిపి
తాగాలి. మొదటిరోజు పది గ్రాముల తేనెతో మొదలు పెట్టి నెమ్మదిగా మోతాదును
పెంచుతుండాలి. లేదా ఒక టీ స్పూను తాజా తేనె, సగం నిమ్మకాయ రసాన్ని గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తరచూ
తీసుకుంటుండాలి.
- ఒబెసిటీ సమస్య నుండి
బయటపడటానికి పుదీనా కూడా ఉపకరిస్తుంది. పుదీనా ఆకులతో చేసిన పచ్చడిని భోజనంలో
తీసుకుంటుండాలి.
- ప్రతిరోజూ ఉదయం 10-12 కరివేపాకు ఆకులు తింటే బరువు తగ్గుతారు. ఇలా
వదలకుండా మూడు నెలలపాటు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. అలాగే టొమాటా కూడా ఉదయం
అల్పాహారానికి ముందు తీసుకోవాలి. ఇలా 3 నెలలు చేయాలి.
- అధిక రక్తపోటును అదుపు
చేయడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది. రోజుకు రెండు లేదా మూడు వెల్లుల్లి
రేకలను పచ్చిగానే తినాలి. ఇది బ్లడ్ ప్రెషర్ని అదుపు చేయడమే కాకుండా తల
తిరిగినట్లుండడం, నిరుత్సాహం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను కూడా
తొలగిస్తుంది.
- తాజా ఉసిరిక రసంలో అంతే
మోతాదులో తేనె కలుపుకుని పరగడుపున తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ అదుపులోకి
వస్తుంది.
- గుండె గదుల పనితీరును
క్రమబద్దీకరించి, హైబీపీని కంట్రోల్ చేయడంలో
ద్రాక్ష బాగా పని చేస్తుంది.
- నిమ్మకాయ బిపిని తగ్గించడంలో
ఉపయోగపడుతుంది. ఇది దాదాపుగా ఏడాది అంతటా అందుబాటులో ఉంటుంది. నిమ్మరసంతో
పాటు తొక్క కూడా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- పుచ్చకాయ గింజలలో బీపీని
అదుపు చేసే గుణం ఉంది. పుచ్చకాయ రసాన్ని(గింజలతో సహా గ్రైండ్ చేసినది)
తీసుకుంటే రక్తనాళాలను పటిష్టపరిచి ప్రసరణ వేగాన్ని చేస్తుంది.
- ఫ్రూట్
జ్యూస్‌లలో చక్కెరకు బదులుగా తేనె వాడకం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది
శరీరానికి శక్తినిస్తుంది.
- సాయంత్రం
తీసుకునే టీలో ఒక టీ స్పూను తేనె కలుపుకుంటే నిద్ర బాగా పడుతుంది.
- అజీర్తితో
బాధపడుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూను తేనె తీసుకుంటే జీర్ణవ్యవస్థ
సక్రమమవుతుంది.
- గుండె
సంబంధితవ్యాధులతో భాధపడే వారికి తేనె చక్కని మందు. రోజు వారి వాడకంలో
ఉపయోగించే తీపికి బదులుగా తేనె తీసుకుంటుంటే గుండెకు మంచిది.
- పిల్లలకు
తేనె వీలయినంతగా ఇవ్వాలి. ఇది పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచడంతోపాటు
చిన్న చిన్న గాయాలను కూడా మాన్పుతుంది. శరీరానికి గాయాలను, రోగాలను ఎదుర్కొనే శక్తినిస్తుంది.
- అవొకాడో
తింటుంటే వయసు మీద పడుతున్నా యవ్వనంగానే కనిపిస్తారు. ఇందులో ఫ్యాట్
ఎక్కువని చాలా మంది అపోహపడుతుంటారు కాని, అవొకాడోలో ఉండే ఫ్యాట్లో ఎక్కువ భాగం మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్.
దీనిని ఆరోగ్యకరమైన ఫ్యాట్‌గా పరిగణిస్తారు. కాబట్టి నిరభ్యంతరంగా తినవచ్చు.
ఇందులోని ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్లు చర్మం
పొడిబారడాన్ని నివారించి నిత్యయవ్వనంగా ఉంచుతాయి. అవొకాడోలో ఉండే 'సి', 'ఇ' విటమిన్లు యాంటి ఏజింగ్
ఎలిమెంట్స్‌గా పనిచేసి వార్ధక్యాన్ని దూరం చేస్తాయి.
- చర్మసంరక్షణకు
గ్రీన్ టీ చక్కగా ఉపయోగపడుతుంది.ఇందులో ఉండే ఆరోగ్య కారకాలు శరీర కణాలను
ఎప్పటికప్పుడు ఉత్తేజితం చేస్తాయి. సాధారణ టీ తాగేవారికంటే గ్రీన్ టీ
తాగినప్పుడు ఉత్సాహంగా ఉండగలగడం సాధ్యమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి
గ్రీన్ టీ మంచి ఫలితాన్నిస్తుంది.
- జలుబుతో
బాధపడుతుంటే రెండు వెల్లుల్లి రేకలను చిదిమి గోరువెచ్చటి పాలలో కలుపుకుని
ఉదయం, సాయంత్రం తాగితే ఉపశమనం
ఉంటుంది.
- ముక్కు
పట్టేసి గాలిపీల్చడానికి కష్టమవుతున్నప్పుడు సమయానికి ఇంట్లో ఏ మందు లేకుంటే
ఒక లీటరు నీటిని మరిగించి అందులో చిటికెడు పసుపు వేసి ఆవిరిపట్టినట్లైతే
జలుబు భారం తగ్గి హాయిగా ఉంటుంది.
- ఏదైనా
పురుగులు, కీటకాలు కుట్టినప్పుడు ఆముదం
రాస్తే సత్వర ఉపశమనం ఉంటుంది.
- ఉప్పును
గోరువెచ్చగా చేసి కాలిన గాయం మీద పెట్టి కట్టుకడితే నొప్పి త్వరగా
తగ్గుతుంది. గాయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా నివారిస్తుంది.
- పిల్లలు
ఎప్పటికప్పుడు చెవిలోపల శుభ్రం చేసుకోకపోవడంతో గులిమి చేరి గట్టిపడి
అప్పుడప్పుడూ నొప్పి పెడుతుంటుంది. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి
రెండు, మూడు చుక్కలను చెవిలో వేస్తే
గులిమి కరుగుతుంది.
- నోటి
దుర్వాసనకు దూరంగా ఉండాలంటే చిటికెడు సోంపును నమలాలి. ఉల్లి, వెల్లుల్లి వంటివి తిన్నప్పుడు వచ్చే నోటి
దుర్వాసన కూడా సోంపు తింటే పోతుంది.
- సోంపును
అలాగే తినడానికి బదులుగా ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూను సోంపును పొడి చేసి
వేసుకుని మరిగించి ఆ నీటిని తాగాలి. ఇది నోటి దుర్వాసనను పోగొట్టడంతో పాటు
జీర్ణవ్యవస్థకు కూడా మేలు చేస్తుంది.
- నిమ్మరసంలోని
యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ఫ్రూట్‌జ్యూస్‌లో కానీ, ఆహారంలో కాని నిమ్మరసాన్ని కలుపుకుని
తీసుకుంటుంటే ఆరోగ్యం మెరుగవుతుంది.
- మేకప్‌ను
సరిగ్గా తొలగించనప్పుడు అది స్కిన్పోర్స్కు గాలి తగలకుండా కవర్ చేస్తుంది.
అలాగే దుమ్ము, జిడ్డు కూడా. వీటిని చర్మం
మీద నుండి తొలగించడానికి హార్మోన్లు ప్రభావితమై పని చేసే క్రమమే మొటిమ
రూపంలో బయటకు వస్తుంది.
- మూసుకుపోయిన
చర్మరంధ్రాల నుంచి మొటిమలు వస్తాయి. కాబట్టి చర్మరంధ్రాలను ఎప్పటికప్పుడు
శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య ఉండదు.
- ఆహారం
కూడా మొటిమల సమస్య పెరగడానికి కారణమవుతుంది. కొవ్వు పదార్ధాలను తగ్గించి
పండ్లు, ఆకుపచ్చకూరగాయలను తినాలి.
ఆహారంలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా
ఉండేటట్లు చూసుకోవాలి.
- రోజుకు
మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. నీరు శరీరంలో చేరిన మలినాలను బయటకు
పంపి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. నీరు తగ్గేకొద్ది మలినాలు శరీరంలోనే
ఉండిపోయి చర్మం పేలవంగా మారుతుంది. క్రమంగా ఇది పైకి కనిపించే మొటిమల సమస్యగా
మాత్రమే కాక దీర్ఘకాల అనారోగ్యాలకు కూడా దారి తీస్తుంది.
- మొటిమ
ఉందంటే అప్పుడప్పుడూ దాన్ని చేత్తో తాకుతూ ఉంటారు. ఇలా తరచుగా తాకుతుంటే
చేతులకు ఉన్న దుమ్ము కూడా చేరి మరింత ఇన్ఫెక్షన్కు దారి తీస్తుంది.
- క్రమం
తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీర అవయవాలకు మాత్రమే కాక చర్మానికి కూడా
మేలు జరుగుతుంది. వ్యాయామం ద్వారా చెమటరూపంలో మలినాలు పోయి దేహం
శుభ్రపడుతుంది.
- శ్వాస
తీసుకోవడంలో ఇబ్బందిగా ఉన్నపుడు, ఒక చిన్నపాత్రలో గాని సీసాలో గాని నిండుగా తేనె పోసి దానికి దగ్గరగా
ముక్కుని ఉంచి తేనె నుండి వచ్చే వాసనను బలంగా పీల్చితే శ్వాస తీసుకోవడంలో
కష్టం లేకుండా చాలా సులభంగా ఉంటుంది.
- ఫ్రూట్స్
అన్నింటిలో అత్తిపండు (మేడిపండు) ఆస్తమాను తగ్గించడంలో బాగా పనిచేస్తుంది.
రెండు, మూడు ఎండు అత్తిపండ్లను గోరువెచ్చని
నీటితో కడిగి ఒక రాత్రి అంతా నానబెట్టి తింటే కఫం బయటికి పోతుంది.
- పెద్ద
ఉసిరి కూడా ఆస్తమాకు బాగా పనిచేస్తుంది. ఐదుగ్రాముల ఉసిరి పొడిలో ఒక టేబుల్
స్పూను తేనె కలిపి ప్రతి ఉదయం తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది.
- కాకరకాయ
వేర్లను మెత్తగా నూరి దీనికి ఒక టీ స్పూను తేనె లేదా తులసి ఆకుల రసం కలిపి
నెలరోజుల పాటు ప్రతి రోజూ రాత్రి తీసుకోవాలి. ఇది ఆస్తమాకు అద్భుత ఔషధంగా
పనిచేస్తుంది.
- గుప్పెడు
ములక్కాడ ఆకులను రెండు కప్పుల నీటిని కలిపి ఐదునిమిషాల పాటు ఉడికించాలి.
చల్లారిన తర్వాత కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి సూప్ తయారు
చేసుకోవాలి. ఈ సూప్‌ని రోజుకు ఒకసారి వేడివేడిగా తీసుకుంటే మంచిది.
- ఒక టీ
స్పూను తాజా అల్లం రసానికి ఒక కప్పు మెంతుల డికాషన్, రుచి కోసం కొంచెం తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే మంచిది.
- పది
వెల్లుల్లి రెమ్మలను కప్పు పాలలో కలిపి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి రోజూ
తీసుకుంటే మంచిది. ఆస్తమా వచ్చిన మొదట్లోనే ఈ వెల్లుల్లి మిశ్రమాన్ని
తీసుకోవడం వల్ల దాని తీవ్రత పెరగకుండా ఉంటుంది.
- వెల్లుల్లి
యాంటీసెప్టిక్‌గా పని చేస్తుంది. కడుపులోకి తీసుకోవడం మాత్రమే కాకుండా పై
పూతగా కూడా మంచి ఫలితాలనిస్తుంది. దెబ్బలు, ఇన్ఫెక్షన్తో వచ్చిన గాయాల మీద వెల్లుల్లిరసం రాస్తే త్వరగా
మానతాయి.
- జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు ఒక పచ్చి
వెల్లుల్లిరేకును చిదిమి అన్నంలో మొదటి ముద్దలో కలిపి తినాలి. ఇలా రోజుకు
రెండు, మూడు సార్లు తీసుకుంటే ఊపిరితిత్తుల్లో
ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గి ఆరోగ్యం కుదుటపడుతుంది. క్రమం తప్పకుండా రోజుకు
రెండుసార్లు వెల్లుల్లి తింటే...
- రక్తప్రసరణను
మెరుగుపరుస్తుంది. కార్డియో వాస్కులర్ సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చేరిన
బ్యాడ్ కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది.
- రక్తాన్ని
పలచబరుస్తుంది. కాబట్టి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉండదు.
- శరీరంలో
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సాధారణంగా వచ్చే అనేక అనారోగ్యాలు దరిచేరవు.
- క్రానిక్
బ్రాంకైటిస్, శ్వాసకోశ సంబంధ రుగ్మతలు వంటి
దీర్ఘకాలిక సమస్యలు తగ్గుతాయి.
- శీతాకాలంలో
తరచుగా ముక్కు పట్టేయడం వంటి సమస్యను తొలగిస్తుంది.
- జీర్ణవ్యవస్థను
శుభ్రపరుస్తుంది. పేగులలో చేరిన పరాన్నజీవులను ఎప్పటికప్పుడు హరించి
వేస్తుంది. కాబట్టి సంబంధిత వ్యాధులు సమస్యాత్మకం కాకుండా ఇంటర్నల్
యాంటీసెప్టిక్‌గా పని చేస్తుంది.
- క్యాన్సర్
నివారిణిగా పని చేస్తుంది. రోజుకు రెండు రేకలు వంటల్లో కాని విడిగా కాని
తీసుకుంటుంటే ఆరోగ్యం సొంతమవుతుంది.
- ప్రతిరోజూ
ఉదయాన్నే పరగడుపున ఐదు తులసి ఆకులను తింటుంటే హెపటైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులను నివారించవచ్చు.
- ఒక టీ
స్పూను శొంఠిపొడిలో పావు టీ స్పూను జీలకర్ర, పావు టీ స్పూను చక్కెర లేదా చిన్న బెల్లం ముక్క కలిపి తింటే దగ్గు
తగ్గుతుంది.
- ఆవాలను
మెత్తగా గ్రైండ్ చేసి తేనె కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.
- దగ్గు
విడవకుండా ఉంటే తులసి ఆకుల పేస్టు, తేనె సమపాళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని ఉదయాన్నే పరగడుపున తినాలి.
- యూరినరీ
ఇన్ఫెక్షన్తో బాధపడుతుంటే రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో చిటికెడు యాలకుల
పొడి కలిపి తాగాలి.
- కడుపు
నొప్పితో బాధపడుతుంటే జీలకర్ర పొడిలో చక్కెర కలిపి బాగా నమిలి తినాలి. ఈ
కాలంలో చక్కెర సరిపడని వాళ్లు దానికి బదులుగా బెల్లం వాడుకోవాలి.
- జలుబుతో
బాధపడుతుంటే ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను తేనె కలిపి ఉదయాన్నే తాగాలి.
- నోరు
చెడువాసన వస్తుంటే రోజూ ఉదయాన్నే ఐదు గ్లాసుల నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల
జీర్ణవ్యవస్థ శుభ్రపడి దుర్వాసన పోతుంది.
- ముక్కుల్లో
నుంచి రక్తం కారుతుంటే రెండు మూడు చుక్కల దానిమ్మ రసాన్ని ముక్కు రంధ్రాల్లో
వేయాలి.
- కంపెనీ
కోసమో, టైం పాస్ కోసమో తినే అలవాటును
వెంటనే మానుకోవాలి. ఆకలి ఉన్నప్పుడు మాత్రమే తినే అలవాటు చేసుకుంటే
జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనారోగ్యాలను నివారించవచ్చు.
- భోజనం
చేసిన తరువాత (లంచ్) అది పూర్తిగా జీర్ణం కావడానికి మూడు నుంచి ఆరు గంటల
సమయం పడుతుంది. అంటే కాయగూరలు, మాంసాహారం, ఆయిలీఫుడ్... ఇలా తీసుకున్న
ఆహారాన్ని బట్టి సమయం ఆధారపడి ఉంటుంది.
- ఓవర్
ఈటింగ్ ఎప్పుడూ మంచిది కాదు. పొట్టను మూడు వంతుల వరకు మాత్రమే నింపాలి.
- బుక్
లేదా పేపర్ చదువుతూ, టీవీ చూస్తూ, మరేదో పని చేసుకుంటూ తినే అలవాటు మానేయాలి.
ప్రశాంతంగా కూర్చుని భోజనం మీదే మనసు కేంద్రీకరించి తినడాన్ని
అలవాటుచేసుకోవాలి.
- భోజనం
తినడం పూర్తయిన తరవాత ఐదు నుంచి పది నిమిషాల పాటు కూర్చుని సుమారు వంద
అడుగులు నెమ్మదిగా నడవాలి.
- రాత్రి
భోజనం మరీ పొద్దుపోయిన తరవాత చేయకూడదు. భోజనానికి పడుకోవడానికి మధ్య విరామం
తప్పనిసరి.
- పిల్లల్లో
తరచుగా కడుపులో నులిపురుగులు చేరుతుంటాయి. దీనికి దానిమ్మ చెక్కు చక్కటి
ఔషధం. దానిమ్మ చెక్కును ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో ఒక టీ
స్పూను దానిమ్మ పొడి కలుపుకుని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగుతుంటే రక్తం
శుద్ధి అవుతుంది. కడుపులో నులిపురుగులు రావు.
- పిల్లలకు
రోజూ సగం గ్లాసు క్యారెట్ రసంలో అంతే మోతాదు టొమాటోల రసం, ఒక టీ స్పూను తేనె కలిపి తాగిస్తే ఆరోగ్యంగా
ఉంటారు. ఇది సహజమైన టానిక్.
- పిల్లలు
దగ్గు, జ్వరంతో బాధపడుతుంటే ఒక
గ్లాసు నీటిలో ఒక టీ స్పూను తేనె కలిపి తాగించాలి. ఇది శరీరానికి తక్షణం
శక్తినివ్వడంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
- ఒక్కొక్కసారి
కొద్దిపాటి తలనొప్పి వచ్చి రోజంతా ఇబ్బంది పెడుతుంటుంది. తలనొప్పికి చేసే ఏ
చికిత్స చేసినా ఫలితం ఉండదు. అలాంటప్పుడు మలబద్ధకం కారణంగా వచ్చిన
నొప్పేమోనని గమనించాలి. పెద్ద పేగులో కదలికలు మందగించినప్పుడు ఆ ప్రభావం
అక్కడి నుంచి తలలోకి కన్క్ట్ అయి ఉండే నరాల వ్యవస్ధ మీద పడి తలనొప్పి
వస్తూంటుంది.
- రోజు
పరగడుపున ఒక లీటరు నీటిని తాగడం, భోజనంలో పీచు పదార్దాలు ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే మోషన్
సిక్ నెస్ సమస్య తగ్గుతుంది.
- ప్రతి
రోజు ఒక కప్పు తాజా పెరుగు తీసుకుంటే జీర్ణాశయంలో అపసవ్యతలు తలెత్తకుండా
ఉంటాయి.
- నిమ్మకాయ
ఊరగాయ రోజుకు ఒక ముక్క తింటే జీర్ణవ్యవస్ధ పనితీరు మెరుగవుతుంది.
- కాలిన
గాయం, దెబ్బలు, పుండ్లు కారణంగా ఏర్పడిన గాయం మీద ఉప్పు కలిపిన
గోరువెచ్చటి నీటిని రాస్తుంటే నొప్పి తగ్గి గాయం త్వరగా మానుతుంది. ఉప్పు
నీరు గాయం ద్వారా ఇతర ఇన్ఫెక్షన్లు శరీరంలోకి సోకకుండా నివారిస్తుంది.
- ఎసిడిటీతో
బాధపడుతుంటే రోజూ ఉదయాన్నే నాలుగు తులసి ఆకులను నమిలి తినాలి. తులసి కడుపులో
మంట, గ్యాస్ట్రబుల్ను
నివారిస్తుంది.
- మంటగా
అనిపించినప్పుడు చిన్న బెల్లం ముక్కను చప్పరించాలి.
- గంటకు
ఒకసారి ఒక అరటిపండు కాని కొన్ని పుచ్చకాయ ముక్కలు లేదా కీరదోస ఏదో ఒకటి
తినాలి.
- కడుపులో
ఉత్పత్తి అయిన యాసిడ్స్ జీర్ణాశయం ఉపరితలానికి చేరినప్పుడు గుండెల్లో మంటగా
అనిపిస్తుంది. అలాంటప్పుడు రెండు బాదం పప్పులు తింటే మంట తగ్గుతుంది.
- రోజుకు
నాలుగైదు సార్లు కొబ్బరి నీళ్లు తాగిన కూడా ఎసిడిటీ నుంచి సాంత్వన
కలుగుతుంది.
- గుండెల్లో
మంట నుంచి కాని కడుపులో మంట నుంచి కాని తక్షణం ఉపశమనం పొందాలంటే చల్లటి పాలలో
చక్కెర కలిపి తాగాలి.
- లవంగ
మొగ్గను నోట్లో పెట్టుకుని రసం కొద్ది కొద్దిగా మింగుతుంటే సమస్య తగుతుంది.
- ప్రతి
రోజూ భోజనం చేసిన తర్వాత ఒక కప్పు తాజా పుదీనా ఆకులు రసాన్ని తాగుతుంటే
క్రమంగా సమస్య తగ్గుముఖం పడుతుంది. ప్రతి రోజూ ఒక టీ స్పూన్ ఉసిరక రసం
తీసుకుంటుంటే కొద్ది రోజులకు ఎసిడిటీ తగ్గుతుంది.
- వెల్లుల్లికి
ఎసిడిటీని అదుపు చేసే గుణం ఉంది. కాబట్టి రోజుకు ఒక పచ్చి వెల్లుల్లి రేక
తింటే ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి.
- రోజూ
ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగితే ఎసిడిటీ
తగ్గుతుంది.
- గోళ్లు
మధ్యలోకి విరగడం, తెల్లగా కాని పసుపుగా కాని
మచ్చలు ఏర్పడడం వంటివన్నీ పైకి సౌందర్య సమస్యలుగా కనిపిస్తాయి కాని నిజానికి
అవి ఆరోగ్యసమస్యలు, శరీరంలో లోపించిన పోషకాల
ఫలితంగా ఇలా ప్రతిబింబిస్తుంది. ఇందుకు ఎక్సటర్నల్ క్యాల్షియం లోపించకుండా
తగినన్ని పోషకాలు ఉండేలా చూసుకుంటే మంచిది కదా! కింది సూచనలు పాటిస్తే గోళ్లు
ఆరోగ్యంగా ఉంటాయి, ఆటోమేటిగ్గా అందంగా
కనిపిస్తాయి.
- గోళ్ల
పెరుగుదలకు క్యాల్షియం, మెగ్నీషియం, డి విటమిన్లు అవసరం, వీటితోపాటు ఎ, డి, విటమిన్లు కూడా లోపించాయంటే గోళ్లు సరిగ్గా పెరగకపోవడం, పెళుసుబారడం, నిర్జీవంగా ఉండడం జరుగుతుంది. సమతుల ఆహారం తీసుకోవడమే దీనికి
పరిష్కారం.
- ఆహారం 50 శాతం పండ్లు కూరగాయలు ఉండేలా చూసుకోవాలి.
అప్పుడే తగిన మోతాదులో విటమిన్లు, పోటీన్లు శరీరానికి అందుతాయి. చేపలు, ఉల్లిపాయలు, సోయగింజలు లేద సోయా
ఉత్పత్తులు, పొట్టు తీయని పప్పుధాన్యాలు
తినాలి. శనగలు పెసలు, మినుములు, గోధుమలు వంటి వాటిని పొట్టుతో సహ తినగలిగేటట్లు
చూసుకోవాలి నీటిని, ఇతర ద్రవపదార్ధాలును రోజుకు
నాలుగు లీటర్లు వరకు తీసుకోవాలి.
- ప్రతి
రోజూ క్యారట్ జ్యూస్ తాగాలి. ఇందులో క్యాల్షియం, ఫాస్ఫరస్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి
- ప్రకృతి
ప్రసాదించిన పదార్ధాలను వీలయినంత సహజరూపం లోతీసుకుంటే దేహం ఆరోగ్యంగా
ఉంటుంది. అనారోగ్యాలు దరిచేరవు.
- ప్రతి
రోజూ నాలుగైదు రెమ్మల పచ్చి కరివేపాకు తింటుంటే చిన్న వయసులో జుట్టు
తెల్లబడడాన్ని నివారిస్తుంది.
- హైబీపీ
లేదా అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే పరగడుపున ఒక పచ్చి వెల్లుల్లి రేకు
తినాలి. వెల్లుల్లి బ్లడ్‌ప్రెషర్‌ను తగ్గించి కొలెస్ట్రాల్‌ను అదుపులో
ఉంచుతుంది.
- ఓట్మీల్
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మూడు వారాలపాటు ప్రతి రోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో
ఓట్ మీల్‌ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- కరివేపాకు
డయాబెటిస్‌ను అరికట్టడంలో సమర్ధంగా పనిచేస్తుంది. ఫ్యామిలీ. హిస్టరీలో
డయాబెటిస్ ఉన్నట్లయితే తప్పకుండా ప్రతి రోజూ ఉదయం పరగడుపున గుప్పెడు
కరివేపాకు ( పచ్చిది కాని మారే రూపంలోనైనా) తినాలి.ఇలా క్రమం తప్పకుండా
వందరోజులు తింటే మంచి ఫలితం ఉంటుంది.
- అల్లం
రసంలో సైంధవ లవణం (షాపుల్లో దొరుకుతుంది) నిమ్మరసంలో కలిపి నీడలో డ్రై అయ్యాక
తింటే తేలిగ్గా జీర్ణమవుతుంది
- ఆల్
బకర పళ్లని తరుచు తింటుంటే మలబద్ధక సమస్య తగ్గుతుంది.
- గ్లాసుడు
వేడినీళ్లలో చిటేకెడు ఆవాలపొడిని వేసి తాగితే అరుగుదల బాగుంటుంది.
- తులసి
ఆకు రసంలో అల్లం రసం కలిపి ఇస్తే పిల్లల్లో కడుపునొప్పి తగ్గుతుంది.
- భోజనం
చెయ్యడానికి పది నిమిషాల ముందు నెయ్యిలో మిరియాల పొడిని కలిపి తింటే
ఆకలవుతుంది.
- నిమ్మరసంలో
జీలకర్ర వేసి ఎండపెట్టి రెండు పూటలా అయిదు గ్రా.లు తింటే పైత్యం తగ్గుతుంది.
- జీలకర్రలో
సైంధవ లవణం కలిపి తింటే వాంతులు తగ్గుతాయి.
- నారింజపండు
తొక్కపొడిని పంచదారతో కలిపి తింటే మలబద్ధకం తగ్గుతుంది.
- శరీరంలో
పోషకాలు లోపిస్తే నోటి పూత తరుచూ బాధిస్తుంటుంది. ఇందుకు గాను తాజా సంత్రా
జ్యూస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో 'సి'విటమిన్ పుష్క్లలంగా ఉంటుంది
- మూత్రసంబంధిత
వ్యాధులతో బాధపడుతున్నవారు అరటి ఆకుల రసాన్ని తీసి, దానిలో కాస్త ఉసిరిరసం, కొంచెం యాలకుల పొడి కలిపి తీసుకుంటే ఫలితముంటుంది.
- గ్యాస్
సమస్య ఉన్నవాళ్లు భోజనం తర్వాత మజ్జిగలో చిటికెడు ఉప్పు, ఇంగువ కలిపి తాగితే మంచి ఫలితముంటుంది.
- కడుపునొప్పి, నీళ్ల విరేచనాలతో బాధపడేవారు బొప్పాయి గింజలు
రెండు భాగాలు, శొంఠి ఒక భాగం, కొద్దిగా ఉప్పు కలిపి చూర్ణం చేసి, నిమ్మరసంతో కలిపి పుచ్చుకుంటే వెంటనే
ఉపశమిస్తాయి.
- ఒక
కప్పు పెరుగులో మూడు కప్పుల నీళ్లు పోసి చిలికి, చిటికెడు ఉప్పు, రెండు చెంచాల చక్కెర, నాలుగైదు గులాబీరేకులు వేయాలి. ఓ అరగంట పాటు అలా
ఉంచి, తర్వాత తాగితే వేసవి తాపం
నుంచి మంచి ఉపశమనం!
- కడుపులో
మంటగా ఉన్నప్పుడు... పావుకప్పు కొబ్బరి పాలలో రెండు చెంచాల ముల్లంగి రసాన్ని
కలుపుకుని తాగితే నెమ్మదిస్తుంది.
- కాకర
ఆకుల్ని ఎండబెట్టి, నేతిలో వేయించి పొడి
చేసుకోవాలి. దీనికి కాస్త ఉప్పు చేర్చి రోజూ అన్నంలో కలుపుకుని ఓ ముద్ద తింటే
చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.
- ఉసిరిరసం, తేనె సమపాళ్లలో కలుపుకుని, ప్రతిరోజూ ఉదయన్నే చెంచాడు తాగితే హై బీపీ
అదుపులోకి వస్తుంది.
- ఉల్లిపాయరసం, తేనె సమపాళ్లలో కలుపుకుని రోజూ రెండు చెంచాలు
తీసుకుంటే రక్తపోటు అదుపులోకి వస్తుంది.
- వెక్కిళ్లు
ఆగకుండా ఇబ్బంది పెడుతుంటే, మిరియాల్ని నిప్పుల మీద
పెట్టి, వచ్చే పొగను పీలిస్తే
ఆగిపోతాయి.